Wednesday, January 22, 2025

యాదాద్రి భువనగిరిలో గుండెపోటుతో రైళ్లో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ యాదాద్రి భువనగిరి : రైలులో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద జగన్నాథ పురం గ్రామానికి చెందిన మల్లేశం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి బయలుదేరారు. లింగంపల్లి నుండి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి రైలులో ప్రయాణిస్తున్న మల్లేశానికి హార్ట్ స్ట్రోక్ రావడంతో రైలులో ఉన్న ఓ వైద్యుడు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం నాగిరెడ్డి పల్లి రైల్వే స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించారు.

అక్కడి నుంచి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించడానికి, చికిత్స కోసం స్టేషన్ మాష్టర్ జన్మభూమి రైలు స్టేషన్ కు వచ్చే లోపు అప్పటికే అంబులెన్స్ సిద్దం చేసి ఉంచారు. రైలు నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్ వద్ద రాగానే 108 అంబులెన్స్ వారు పరిశీలించి అప్పటికే మల్లేశం మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారాన్ని రైల్వే అధికారులకు తెలియజేశారు. ఫార్మాలిటీస్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లనున్నట్లు వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News