Monday, January 20, 2025

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి సమీపంలోని సబ్ స్టేషన్ క్రాసింగ్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాకకు చెందిన పర్వతం సుధాకర్, అతని చిన్నాన్న రాములు ఇద్దరు కలిసి వ్యక్తిగత పని నిమిత్తం దుబ్బాక నుంచి

సిద్దిపేటకు వెళుతుండగా దుబ్బాకకు చెందిన ఆలేటి ప్రసాద్ పెద్ద గుండవెల్లి నుంచి దుబ్బాకకు వస్తున్న క్రమంలో ఎదురుఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి ఢీకొనడంతో పర్వతం సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్, రాములకు తీవ్రగాయాలు కావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించి నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News