ఎల్లారెడ్డిపేట : మండల కేంద్రానికి చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం ముస్తాబాద్ మండలం బదనకల్ బస్ స్టాప్ వద్ద సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొంది. ఈ సంఘటనలో గంట దుర్గయ్య గౌడ్ (46) గాయపడి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆయనతో ప్రయాణిస్తున్న డ్రైవర్ రేసు శ్రీమాన్ , గురుక సతీష్ , ఊషి సునిల్ ప్రాణాపాయం నుండి బయట పడి తీవ్ర గాయాలపాలై సిద్దిపేట ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై కారు ధ్వంసమైనట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై ఎల్లారెడ్డిపేలో విషాధచాయలు నెల కొన్నాయి. కల్లు గీత కార్మీకుడైన దుర్గయ్య మృతితో భార్యా పిల్లలు , తల్లి తండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఆ కుటుంబానికి గత సంవత్సరం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ కెటాయించింది. భార్య రేణుక బీడి కార్మీకురాలిగా పని చేస్తుంది. భర్త కల్లు డిపోలో పని చేసి పొట్ట పోసుకుంటున్నారు. కుమార్తెలు అకాంక్ష, అక్షిత , కుమారుడు శ్రీకర్ ఉన్నారు. రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత శ్రీమాన్ బలవంతవగా దుర్గయ్యను హైదరాబాద్ తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటిసి చీటి లక్ష్మన్ రావు , ప్యాక్స్ చేర్మేన్ గుండాడి క్రిష్ణా రెడ్డి ,సెస్ డైరెక్టర్ క్రిష్ణహరి సంఘటన స్థలానికి వెల్లి వివరాలుఆరాతీసి క్షతగాత్రుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరమార్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రమాధంపై ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.