Sunday, February 23, 2025

పెద్దపల్లి జిల్లాలో కారు బీభత్సం..

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న పంక్చర్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పంక్చర్ షాపులో ఉన్న ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News