Wednesday, January 22, 2025

నలుగురిని కాపాడి..మృత్యు ఒడికి

- Advertisement -
- Advertisement -

వరద మిగిల్చిన కన్నీటి వ్యథ ఇది. విజయవాడ వరదల్లో నలుగురిని కాపాడిన ఓ వ్యక్తి అనంతరం వరదలో కొట్టుకుపోతున్న 50 ఆవులను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్(32)కు సింగ్‌నగర్‌లో ఓ డెయిరీ ఫాం ఉండగా ఆయనతో పాటు ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు యువకులు డెయిరీ ఫాంలో పని చేస్తున్నారు. ఆదివారం ఒక్కసారిగా వరద పోటెత్తగా నీటిలో కొట్టుకుపోతున్న సోదరులతో పాటు ఇద్దరు యువకులను కాపాడి డెయిరీ ఫాం పైకప్పు వద్దకు చేర్చాడు.

అనంతరం తాళ్లతో కట్టి ఉంచిన ఆవులను రక్షించేందుకు వెళ్లి అవి ప్రాణాలతో ఉంటాయని భావించి తాళ్లు విడదీశాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వచ్చి పైకప్పు ఎక్కేందుకు ప్రయత్నించగా కాలు జారి కింద పడడంతో ప్రవాహంలో కొట్టుకుపోయాడు. డెయిరీ ఫాంకు 500 మీటర్ల దూరంలో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. కాగా, ప్రస్తుతం చంద్రశేఖర్ భార్య 8 నెలల గర్భిణీ. తమను కాపాడి కళ్ల ముందే అన్న కొట్టుకుపోయాడంటూ సోదరులు కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News