Monday, December 23, 2024

తేనె టీగల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో..

- Advertisement -
- Advertisement -

కొత్తగూడ: తేనె టీగల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఒకరు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షకుల కథనం ప్రకారం.. మండలంలోని నీలంపల్లి వద్ద పొలం పనులకు అన్నదమ్ములైన కోన్‌రెడ్డి సంజీవ, జనార్దన్ వెళ్లారు.

ఇదే క్రమంలో ఇద్దరు అన్నదమ్ములపై తేనె టీగలు దాడి చేశాయి.ఈ క్రమంలో వాటి భారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టగా ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో పడ్డారు. కాగా ఇందులో సంజీవకు ఈత రాకపోవడంతో బావిలో మునిగి చనిపోయారు. కాగా జనార్దన్‌కు ఈత రావడంతో ప్రాణాలతో బయట పడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News