Saturday, December 28, 2024

ఎస్‌ఐ కొట్టడంతో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

దేవరకొండ : నల్లగొండ జిల్లా.. చింతపల్లి మండలం.. పోలేపల్లి రాంనగర్ గ్రామ పంచాయతీ పాలెం తండాకు చెందిన నేనావత్ భీమా నాయక్, సూర్య నాయక్ అనే అన్నదమ్ముల భూవివాదంలో ఆదివారం స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్‌లో సూర్య నాయక్ ఫిర్యాదు చేశాడు. అయితే, భీమా నాయక్ నుంచి భారీగా ముడుపులు తీసుకొని ఎస్‌ఐ సతీష్ రెడ్డి సూర్యనాయక్‌పై విచక్షణా రహితంగా పోలీస్ స్టేషన్‌లోనే కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిసుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రి నుండి మృతదేహాన్ని చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకొని ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి వారిని బయటకు వెళ్లకుండా నిర్భందించారని కుటుంబ సభ్యులు వాపోయారు. కాగా, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News