- Advertisement -
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎంఎల్ఎ గన్ మెన్ మృతి చెందిన సంఘటన ఆదివారం అర్థరాత్రి బిడిఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శంకర్ పల్లి మండలం బుల్కాపూర్ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్ తన అమ్మమ్మ ఊరైన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఎలిమెల గ్రామంలో ఆదివారం బీరప్పల జాతర ఉండటంతో వెళ్లాడు. జాతర అయిపోయిన తరువాత రాత్ర్రి తిరిగి బుల్కాపూరి కి వస్తుండగా కొండకల్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -