Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ గేట్ జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్ కాలనీకి చెందిన బాలరాజు (40) తన టిఎస్ 31ఈ 2211 ద్విచక్ర వాహనంపై తన సొంత పని నిమిత్తం తాండ్ర గ్రామానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి పట్టణంలోని తన ఇంటికి వస్తుండగా

మార్గమధ్యలో గ్రామ శివారులోకి జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న టిఎస్ 09 ఈఆర్ 9866 స్విఫ్ట్ డిజైర్ కారు ఢీ కొనడంతో బాలరాజు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అటుగా వెళ్తున్న వారు తెలిపిన సమాచారం మేరకు వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News