Monday, April 28, 2025

బిఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లి వస్తుండగా ప్రమాదం..ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థతి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా నంగునూరు మండలంలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.  బిఆర్ఎస్ మీటింగ్ వెళ్లి తిరిగి వస్తుండగా తుఫాన్ వెహికల్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన సారయ్య s/0 దుర్గయ్య వయసు (36) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని  ప్రభుత్వా ఆసుపత్రికి తరలించినారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News