మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: గురువారం ఉద యం ఏడున్నర…విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…తండ్రి రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు వదలగా…రెండేళ్ల బాలుడు గాయాలతో రోడ్డుపైనే ఏడుస్తూ కనిపించిన దృశ్యం అక్కడున్న వారందరినీ కంట తడిపెట్టించింది. సరిగ్గా మాటలు రాక…ఏమైందో అర్థంకాక స్వల్పగాయాలతో బయటపడిన ఆ బాలుడు తన తండ్రిని చూస్తూ ఏడుస్తూ కూర్చోవడం కలిచివేసిలా చేసింది. ఇదే దారిలో వెళ్తున్న వాహనదారులు బాబును చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. డిసిఎం డ్రైవర్ నిర్లక్షం వల్ల అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి……
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వురు మండలం అతివదులు గ్రామానికి చెందిన శేట్టి కనక ప్రసాద్ (30) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ స్థానికంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనామ్‌గూడ గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య , 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఇదిలావుండగా శుక్రవారం ఉదయం అతని కుమారుడు శివతో కలిసి తన ద్విచక్రవాహనంపై టిఫిన్ తీసుకొని అబ్దుల్లాపూర్‌మెట్ నుండి ఇనామ్‌గూడకు వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై యుటర్స్ చేస్తుండగా డిసిఎం డ్రైవర్ నిర్లక్షంతో అజాగ్రత్తగా కనక ప్రసాద్ బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు సంవత్సరాలు బాబు శివకు స్వల్ప గాయలైయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమెదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.