- Advertisement -
హైదరాబాద్: చెత్త సేకరించే ఆటో బీభత్సం సృష్టించిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కి చెందిన చెత్త సేకరించే ఆటో రెండు కార్లు, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనా పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -