Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలోఒకరి మృతి.. మరోకరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుర్రేగాడు గ్రామానికి చెందిన పెంద్రం చిలుకు మృతి చెందగా, గణేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. యాప ప్రాంతం నుండి వెంకటాపూర్ గ్రామానికి వెళ్లే దారి మధ్యలో బోరు సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని తీవ్రంగా గాయపడిన గణేష్ ను 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News