Sunday, January 19, 2025

దంపతుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. భర్త మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు భార్య భర్తలు భైక్ పై వెళ్తుండగా అత్తాపూర్ వద్ద దంపతులపైకి వేగంగా ట్రక్కు దూసుకు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్తకు తీవ్రగాయాలు అవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. గాయపడిన భార్యను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News