Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి : ఇద్దరు యువకులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

కొణిజర్ల : కోసం వెళుతున్న ఓ వ్యక్తిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరొక ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైరాలోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని జస్వంత్ ఫీలింగ్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన కొండా సత్యం (47) మృతి చెందాడు. సత్యం గ్రామాల్లో తిరుగుతూ జల్లి బుట్టలు, చాటలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.

తల్లాడ మండలం అంజనాపురంలో జల్లి బుట్టలు, చాటలు తయారు చేస్తుంటారు. అయితే అంజనాపురంలో కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై సత్యం ఆదివారం ఉదయం పల్లిపాడు గ్రామం నుంచి బయలుదేరారు. బుల్లెట్‌పై వెలుతున్న వ్యక్తి వైష్ణవి మిల్ ఫ్యాక్టరీ సమీపంలోని జస్వంత్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వైరా వైపు వెళ్తున్న సత్యం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టడంతో సత్యం తన బైక్‌పై నుంచి 20 మీటర్ల దూరం రోడ్డుపై ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బులెట్‌పై ఉన్న అన్నదమ్ములు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులకు వైరాలోని పిహెచ్‌సిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీవనోపాధిలో భాగంగా చాటలు కొనుగోలు చేసేందుకు బయలుదేరిన సత్యం మృతి విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య గోవిందమ్మ, కుమారుడు సురేష్, కుమార్తె చైతన్య ఉన్నారు. కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News