Sunday, December 22, 2024

కొడుకు అదృశ్యం.. గుండెపోటుతో తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

ఓ నిర్మాణ సంస్థ వత్తిడి వల్లే ఓ నిండు కుటుంబం పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కొందరి వేధింపుల వల్ల కొడుకు అదృశ్యమైతే.. కొడుకు అదృశ్యమయ్యాడనే వేదనతో అతడి తండ్రి గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగా రు. ఈ సంఘటన దూండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.. దుండిగల్ గండి మైసమ్మ మండలం దొమ్మరపోచంపల్లి సర్వే నంబర్ 188 లోని 1ఎకరం 34 గుంటల భూమి అమ్మాలని త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ ఓనర్ సుధాకర్, నిజాంపేట బిఆర్‌ఎస్ కార్పొరేట్ మేకల వెంకటేశం, వత్తిడి చేయడంతో వంపుగూడెం మాధవరెడ్డి గత మంగళవారం దుండిగల్ సిఐ పేరిట లేఖరాసి అదృశ్యమయ్యాడు. కుమారుడు అదృశ్యమైన సంఘటనను జీర్ణించుకోలేని అతడి తండ్రి కృష్ణా రెడ్డి(70) గుండెపోటుతో మరణించాడు.

మాధవరెడ్డి అదృశ్యం వెనుక, కృష్ణారెడ్డి మరణానికి కారణం కూడా త్రిపురా ల్యాండ్ మార్క సంస్థ యజమానీ, నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం వత్తిడేనంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భూమిని అమ్మకపోతే మాధవరెడ్డిని కులం నుండి వెలేస్తామని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన మాధవరెడ్డి దుండిగల్ సిఐ పేరిట లేఖరాసి అదృశ్యమయ్యాడు. మాధవరెడ్డి సిఐకి రాసిన లేఖతో కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలోనే మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి (70) కుమారుడు అదృశ్యాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలి అక్కడికి అక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. గత రెండు నెలల క్రితం ఇరువురిపై పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేశారు. దుండిగల్ పోలీసులు బరంపేటలో.. ప్రతి సీసీ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మేడ్చల్ ఏసిపి శ్రీనివాసరెడ్డి స్పందించి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News