Thursday, November 21, 2024

పాముకాటుతో యువకుడి మృతి… గంగా నదిలో మృతదేహం ముంచితే బతుకుతాడని?

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒక్కోసారి మూఢనమ్మకాలు చూస్తే పిచ్చి పీక్ స్టేజీకి చేరింది అనిపిస్తుంది. ఓ యువకుడిని పాము కాటు వేయడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. పాము కరిచిన వ్యక్తి మృతదేహాన్ని గంగా నదిలో ఉంచితే విషం బయటకు పోయి అతడు బతుకుతాడని చెప్పడంతో కుటుంబం సభ్యులు నమ్మకం పెట్టుకున్నారు. వెంటనే మృతదేహానికి తాడు కట్టి గంగా నదిలోకి వదిలారు. గంగ నదిలో మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానిక ప్రజలు ఎలా బ్రతుకుతాడని చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షార్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….

రెండో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఉండడంతో మోహిత్ కుమార్ (20) అనే యువకుడు ఓటు వేయడానికి తన సొంతూరుకు వచ్చాడు. ఓట వేసిన అనంతరం సేదతీరటానికి పార్కుకు వెళ్లాడు. పార్కులో అతడిని పాము కాటువేయడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని గంగా నదిలో ఉంచితే పాము విషం బాడీలో నుంచి బయటకు వస్తుందని అనే మూఢనమ్మకం కుటుంబ సభ్యులకు ఉంది. మృతదేహానికి తాడు కట్టి గంగా నదిలో వదిలారు. మృతదేహం గంగా నదిలో తాడు కట్టి కనిపించడంతో జనాలు తండోపతండాలు వచ్చి చూస్తున్నారు. కొన్ని గంటల పాటు మృతదేహం గంగానదిలో ఉంచిన చలనం లేకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పిచ్చి ముదిరిందని దేవులపల్లి నరసింగరావు అనే నెటిజన్ కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News