Saturday, December 21, 2024

అనుమానస్పదంగా లిఫ్ట్‌లో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో సందీప్ ఎలక్ట్రానిక్ షాప్ యజమాని నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద అనుమానస్పదస్థితిలో లిఫ్ట్‌లో పడి లింగంపల్లి దత్తాద్రి అనే వ్యక్తి మృతి చెందాడు. నూతనంగా నిర్మాణం చేపట్టే భవనంలోని లిఫ్ట్‌లో దత్తాద్రి మృతదేహం లభించడంతో అతనిది హత్యనా లేక ఆత్మహత్యనా, లేక ఏదైన ఘర్షణ కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ నరేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News