Monday, December 23, 2024

విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

గుర్రంపోడ్ ః విద్యుత్ షాక్‌ గురై ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పాల్వాయి గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. దీనికి సంబందించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన నిమ్మల యాదగిరి(28) తన భార్య ధనమ్మ తన ఇద్దరు పిల్లలతో గుర్రంపోడ్ మండలంలోని పాల్వాయి గ్రామంలోగల తన పుట్టింటి వెళ్లగా, భార్య,పిల్లలను తీసుకురావడానికి బుధవారం పాల్వాయి గ్రామానికి వెళ్లాడు. ధనమ్మ బట్టలు ఉతికి తన తల్లిదండ్రులు కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్‌పై ఆరవేసింది.

కాగా అదే రోజు సాయంత్రం యాదగిరి ఆరవేసిన బట్టలు తీసుకువచ్చే క్రమంలో ఇంటి పై ఉన్న 11కెవి విద్యుత్ తీగలు గమనించకపోవడంతో ,తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే పడిపోగా, ఇది గమనించిన యాదగిరి భార్య ధనమ్మ దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. మృతుడి భార్య ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంపోడ్ ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News