Sunday, January 19, 2025

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణం బలి

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ ః- దుండిగల్ పియస్ పరిధి మల్లంపేట లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వైఖరితో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కరీంనగర్ జిల్లా అనంతగిరి, ఇల్లంతుకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి (57) కుటుంబం తో కలసి మల్లంపేట డ్రీమ్ వ్యాలీలో నివాసముంటున్నాడు. ఒక కుమారుడు విదేశాలలో వుంటుండగా మరో కుమారుడు తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. అదే గ్రామం ఆకాష్ లేఔట్ లో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న సత్యనారాయణ రెడ్డి

రోజులాగే సోమవారం ఉదయం వాటర్ ప్లాంట్ దగ్గరకు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో విద్యుత్ వైర్ తెగి మెడ మీదపడడంతో అతను స్పృహతప్పి పడిపోగా వెంటనే బాచుపల్లి లోని మమతా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికి మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో దుండిగల్ పోలీసు లు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News