Wednesday, January 22, 2025

విద్యుత్ ఉన్నత అధికారుల నిర్లక్ష్యం… వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కొల్చారం: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలేనా ఘటన మండల పరిధిలోని పైతర సబ్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పైతర సబ్ స్టేషన్ లో శుక్రవారం గడ్డమీది సిద్ధి రాములు, తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నట్లు సమాచారం శుక్రవారం ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య రేణుక ఓ కుమారుడు కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కానీ కొల్చారం మండలంలో రిటైర్ అయిన ఉద్యోగుల ప్లేస్ లో తమకు సంబంధించిన వారిని సబ్ స్టేషన్లలో ఉంచి పనిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి విద్యుత్ శాఖ ఉన్నత అధికారుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. పైతర సబ్ స్టేషన్ లో లైన్మెన్ గా రిటైర్మెంట్ అయిన నారాయణ కుమారుడు గడ్డమీద సిద్ధిరాములు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తి చేస్తుండగా మృతి చెందడం ఇదే సబ్ స్టేషన్ లో బండి శేఖర్ అనే వ్యక్తి కూడా ఈ కోవాలని పనిచేస్తున్నారు.

కోనపూర్ సబ్స్టేషన్లో రిటైర్మెంట్ ఎంప్లాయ్ స్థానంలో మల్లేశం నర్సాపూర్ కు చెందిన తాజుద్దీన్ పోతంశెట్టి పల్లెలో కూడా ఇంకో ఒకరు పని చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయం జిల్లా డివిజన్ నియోజకవర్గ మండల స్థాయి విద్యుత్ శాఖ అధికారుల అందరికీ తెలుసునని, దీనివల్ల ఇటీవల కొత్తగా రిక్రూట్మెంట్ అయినా ఆర్టిజన్లకు ఇబ్బందులు తలచుతున్నాయని, పలువురు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News