Tuesday, January 14, 2025

రక్తం జుర్రుతానని మెడపై కొరకడంతో… స్నేహితుడి హత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: తాగిన మైకంలో స్నేహితుడి రక్తం తాగుతానని మెడపై కొరకడంతో అతడిని మిత్రుడు చంపిన సంఘటన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాహుల్ లోహర్, ఇస్తిక్ ఖాన్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. తాగిన మైకంలో ఇస్తిక్ ఖాన్ తనకు నీ రక్తం తాగాలని ఉందని రాహుల్‌ను అడిగాడు. రాహుల్ మెడ్‌పై కొరికాడు. దీంతో ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే రాహుల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెండు గంటల తరువాత ఇస్తిక్‌ను రాహుల్ కలిశాడు. తన రక్తమే తాగుతావారా? అని గట్టిగా అరిచాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే రాహుల్ రాయి తీసుకొని ఇస్తిక్ తలపై బాదాడంతో కిందపడి చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. రాహుల్ లోహర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: ఫుట్‌బాల్ ఆటగాడిని చంపిన మొసలి (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News