- Advertisement -
బెంగళూరు: సోషల్‌మీడియా వాడకం రోజురోజుకీ మితిమీరి పోతోంది. పాపులారిటీ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా భయంకరమైన ఫీట్లు చేస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఓ కుర్రాడు కూడా అలాంటి పని చేశాడు. నడిరోడ్డుపై కుర్చీ వేసుకొని.. టీ తాగుతూ రీల్ చేశాడు. కట్ చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
బెంగళూరులోని మగడి రోడ్డులో ఏప్రిల్ 12వ తేదీన ఓ యువకుడు రోడ్డుపై కుర్చీలో కూర్చొని టీ తాగుడూ రీల్ చేశాడు. పక్కనుండి వాహనాలు వెళ్తున్నా.. అతను పట్టించుకోలేదు. అలాగే వీడియో తీసి.. దాన్ని ఇన్‌స్టాలో పోస్ల్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో పోలీసుల కంటపడటంతో అతన్ని వెతికి అరెస్ట్ చేశారు. ట్రాఫిక్‌లో ఇలాంటివి చేస్తే.. మీకు ప్రశంసలు కాదు.. జరిమానా పడుతుంది అంటూ అతన్ని అరెస్ట్ చేసిన వీడియోని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
- Advertisement -