Monday, January 20, 2025

వనదుర్గా ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

పాపన్నపేట: వనదుర్గా ప్రాజెక్టులో నీట మునిగి చికి త్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ విజయకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిషా రాష్ట్రం రాయ్‌గడ్ జిల్లాకు చెందిన శ్రీధర్ సబార్(22)గత యేడాదిక్రితం బతుకు దెరువు కోసం సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఆదివారం తమ బందువు అయిన బినోద్, ఇతర స్నేహితులతో కలిసి ఏడుపాయల ఆలయం వద్దకు వచ్చారు. దర్శనం తర్వాత ఆలయ స మీపంలోని వనదుర్గా ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడ ఈత కోసం ప్రాజెక్టులోకి దిగారు. శ్రీధర్ ప్రాజెక్టుపై నుంచి కిందికి దూకడం తో జారినీటిలో పడి తలకి గాయమైంది. వెం టనే అక్కడ ఉన్న తోటి స్నే హితులు గమనించి చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్క డ చికిత్స పొం దుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి బం ధువు బినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News