Friday, December 20, 2024

ఆన్‌లైన్ గేమ్స్ కు బానిసై.. అప్పుల బాధతో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

చేగుంట: అప్పుల బాదతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వడియారం గ్రామానికి చెందిన సురేష్ యాదవ్ (30) అప్పుల బాదకు గ్రామ శివారులో రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నాడు. నరేష్ ఆన్‌లైన్ గేమ్స్కు బానిసై.. అప్పుల ఎక్కువై తీర్చలేక బాధతో వేగంగా వెళ్తున్న రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News