Sunday, December 22, 2024

యన్మన్ గండ్లలో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

నవాబ్ పేట్: మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన కోస్గి శివయ్య అలియాస్ పెంటయ్య (43) అనే వ్యక్తిని దుండగులు గురువారం దారుణంగా హత్య చేశారు. రాత్రి కుటుంబసభ్యులతో పాటే నిద్రించిన శివయ్య తెల్లవారేసరికి పడుకున్న చోటే శవమై పడి ఉన్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో శివయ్య గొంతు కోసి చంపేశారు. ప్రతిరోజు ఉదయం లేచే శివయ్య పొద్దెక్కినా కూడా లేవకపోవడంతో ఆయన భార్య సత్యమ్మ లేపే ప్రయత్నం చేసినా కూడా లేవకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి ఆయన కప్పుకున్న దుప్పటి తీసి చూడగా గొంతు కోసి దారుణంగా హత్య చేయబడినట్లుగా కనిపించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News