- Advertisement -
హైదరాబాద్: సిటీలోని పంజాగుట్టలో వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఆస్తి కోసం పారిశ్రామికవేత్త వీసీ జనార్థన్ రావును సొంత మనవడు కీర్తితేజ హత్య చేశాడు. ఇటీవల జనార్థన్ రావు తన కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినట్లు సమాచారం. తనకు కూడా డైరెక్టర్ పోస్ట్ కావాలని కీర్తితేజ డిమాండ్ చేశాడు.
చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు జనార్థన్ రావు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తాతపై కోపం పెంచుకున్న మనవడు కీర్తితేజ కత్తితో దాడి చేశాడు. ఏకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -