- Advertisement -
ఆస్తి తగాదాలతో సొంత తమ్ముడినే అన్న కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కాకరవాయిలో బెజ్జం కొండా, బెజ్జం అర్జున్ అనే ఇద్దరు అన్నదమ్ములు మధ్య కొంతకాలంగా ఆస్తి తాగాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రెచ్చిపోయిన అన్న.. తమ్ముడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ జరిపారు. అనంతరం అన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -