Monday, April 7, 2025

మహిళతో సహజీవనం.. ఖమ్మంలో వ్యక్తి హత్య!

- Advertisement -
- Advertisement -

ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని నేతాజీనగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. రవిప్రసాద్‌ అనే గుత్తేదారు.. కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత నాలుగు నెలల క్రితం మహిళతో పాటు సత్తుపల్లి నుంచి ఖమ్మం వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే, అర్ధరాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో సదరు మహిళ.. రవిప్రసాద్‌ను నెట్టేయడంతో గోడకు తగిలి తీవ్రగాయం కావడంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రవిప్రసాద్‌ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News