Sunday, December 22, 2024

పండగ పూట విషాదం.. విద్యుత్ తీగల్లో చిక్కున్న గాలిపటాన్ని తీస్తుండగా…

- Advertisement -
- Advertisement -

సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా ఝ‌రాసంగం మండ‌లంలో విషాదం నెల‌కొంది. పొట్‌ప‌ల్లి గ్రామంలో గాలపటం ఎగరవేయగా.. అది విద్యుత్ తీగ‌ల్లో చిక్కుకుంది. దాంతో గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివ‌కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వెంటనే చికిత్స కోసం జ‌హీరాబాద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పొట్‌ప‌ల్లి గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. గాలిపటాలు ఎగరవేస్తూ ఒక్క హైదరాబాద్ లోనే గత మూడు రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News