Friday, November 15, 2024

ఆత్మహత్యలకు అడ్డాగా బాసర..

- Advertisement -
- Advertisement -

బాసర : ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదు. .. రక్షణ కల్పించాలని వేడుకోలు… ఆత్మహత్యలకు కేరాఫ్ బాసర గోదావరి…. దక్షిణ భారతదేశంలో చదువులమ్మ తల్లి బార సరస్వతి జ్ఞానానికి ప్రతీకగా వెలుగొంతుంది. కానీ ఈ సరస్వతి అమ్మ క్షేత్రంలోని గోదావరి పలువురు క్షణికావేశంతో నిండు జీవితాన్ని నీటి పాలు చేసుకుంటున్నారు. కుటుంబంలోని కలహాలు, క్షణికావేశం నిండు జీవితం గోదావరి నదిలో కలిసి పోతుంది. ఆర్తిక ఇబ్బందలుఉ, ప్రేమ విఫలమై అనారోగ్య సమస్యలు జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.హైదరాబాద్ నుండి కాకుండా భైంసా, నిర్మల్, మహారాష్ట్ర ధర్మాబాద్, పర్బని, నాందెడ్, తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బలవన్మరణానికి పాల్పడుతుండడంతో బాసర బాసర తీర్థం ఆత్మహత్యలకు అడ్డగా మారింది.

కాగా ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు ఆందోళన కరంగా మారాయి. బాసర వద్ద సిసి కెమెరాలతో నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని రక్షణ చర్యటు చేపట్టాలని పోలీసులతో నిరంతరం గస్తీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.ఇటీవల బాసర గోదావరి వద్ద వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నారు. నవిపేట్ మండలంలోని పొతంగల్‌కు చెందిన ఇరిగేషన్ డీఈఈ రమణ రావు ఆత్మహత్య రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మామ అవమానించాడని హైదరాబాద్ కు చెందిన సందీప్ శనివారం పట్టపగలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతే గాకుండా అభం శుభం ఎరుగని కొడుకు కుమార్తెతో నిజామాబాద్‌కు చెందిన ఓ తల్లి బాసర నదిలో స్నానమచరించడానికి వచ్చినట్టు వచ్చి నదిలో లోపలికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.

నవిపేట్ పోలీస్‌స్టేషన్ పరిదిలో 2020 లో ఐదుగురు, 2021 లో ఆరుగురు, 2022 లో ఐదుగురు 2023 లో ఇప్పటి వరకు ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు మరి కొంత మంది నది తీరం వద్ద ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలు కొట్టుకుపోతూ ఆచూకి లేకుండా పోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడే వ్యక్తులను రక్షించే బాద్యత ప్రభుత్వ యంత్రాంగం తీసుకోవాలి నది తీరం వద్ద 24 గంటల పాటు గస్తీ తిరిగేలా పోలీసు సిబ్బందితో పాటు హోంగార్డును అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. గోదావరి బ్రిడ్జి పైన సిసి కెమెరాలతో పాటు బ్రిడ్జికి రెండు వైపులా ఇనుప కంచె ఏర్పాటు చేసి పోలీసు రెవెన్యూ సిబ్బంది నిగాను పెంచితే ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మహత్యలకు పాల్పడేందుకు వచ్చిన వ్యక్తులను గర్తించి పోలీసు శాఖ ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే వారి సమస్యల నుండి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది గంగపత్రులే రక్షకులు.

గోదావరిలో చేపలు పట్టే గంగపుత్రులు సందర్భాల్లో ప్రాణ రక్షకులుగా చాలా మారుతున్నారు. మహారాష్ట్ర పర్బనికి చెందిన విద్యార్థిని బాసరలో రైల్వే బ్రిడ్జి నుండి రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు గోదావరిలో దూకగా బ్రిడ్జి స్తంభం ఇనుప కడ్డి పట్టుకొని రాత్రంతా నీటిలోనే గడిపింది. ఉదయం గమనించిన జాలర్లు ఆమెను సురక్షితంగా రక్షించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్న చాలా సందర్భాల్లో యంచ గ్రామ జాలర్లు వీఆర్‌ఏలు యువకులు కాపాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News