Friday, December 27, 2024

వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: వాగులోకి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మిడిదొడ్డి మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన గంశెట్టి రాజేష్ గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురై గత మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోవ డం జరిగిందన్నారు. మిడిదొడ్డి మండల పరిధిలోని లింగంపల్లి శివారులోని కూడా వెళ్లి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిపారు. కా గా కుటుంబ సభ్యులకు ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజేష్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో

కుటుంబ సభ్యులు వాగు వద్దకు వచ్చేసరికి వాగులోకి దూకడం జరిగిందన్నారు. వెంటనే మిడిదొడ్డి పోలీసుల కు కుటుంబ సభ్యులు సమాచారం అందజేశారు. స్థానికుల సాయంతో వాగులోకి దిగి రాజేష్ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోవడంతో సిద్దిపేట నుంచి గజ ఈత గాల్లను రప్పించి మూడు గంటల పాటు శ్రమించి రాజేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. రాజేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News