Saturday, February 22, 2025

మద్యానికి బానిసై ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వర్ని ః వర్ని మండలం కేంద్రంలోని కోటయ్య క్యాంపులో ఎస్‌ఎన్ పురం గ్రామ పంచాయతీలో  షేక్ నాజర్ వలి (వయస్సు 36) నివాసముంటున్నాడు. వృత్తి రిత్య లేబర్ పని చేసుకుంటున్న నాజర్ భార్య పిల్లలకు  దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగుడికి బానిసై మనస్తాపం చెంది జీవితంపై విరక్తితో ఇంట్లో ఇనుప రాడ్లకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తమ్ముడు షేక్ బాజీ ఫిర్యాదు మేరకు శవాన్ని పరిశీలించి ఎస్సై కృష్ణ కుమార్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News