Monday, December 23, 2024

భార్య అవమానించిందని భర్త ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అక్కన్నపేట: కుటంబ కలహాలతో అత్తమామలు, భార్య అవమానించారని మనస్ధాపానికి గురై వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కన్నపేట మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ తాండ్ర వివేక్ తెలిపిన వివరాల ప్రకారం అక్కన్నపేట మండలం చాపగానితండాకు చెందిన గుగులోతు రాజు నాయక్ (30) తండ్రి లక్షకు నాలుగు సంవత్సరాల క్రితం కేశ నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు ముందు తండాకు చెందిన బానోతు లావణ్యతో వివాహాం జరిగింది. ఈ దంపతులు కరీంనగర్ లోని శాంతి నగర్‌లో కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు.

వీరు ఇరువురి మద్య తరుచుగా గొడవలు జరిగి మూడు సార్లు పంచాయతీ జరగడంతో వేరు వేరుగా ఉంటున్నారు. పది రోజుల క్రితం తన భార్య కోర్టు నుంచి విడాకుల నోటిసు పంపగా ఇట్టి విషయం తెలుసుకునేందుకు రెండు రోజుల క్రితం అడుగుదామని తన అత్తగారింటికి ఇంటికి వెళ్లగా అత్త విజయ, మామ రాజు, భార్య,బామ్మర్ధులు అవమానించి వెళ్లగొట్టారని భాదపడుతూ తన మనోవేదన తల్లిదండ్రులకు తెలిపాడు. వారి వేధింపులు భరించలేక ఏమి చేయాలో తోచక గురువారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News