Wednesday, January 22, 2025

కీసరలో విషాదం.. మెడికల్ షాపులో గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి..

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంపల్లిలోని సత్యనారాయణ కాలనీలో ఉన్న మెడ్ ప్లస్ ఫార్మసీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.  గురువారం మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ లో విధులు నిర్వహిస్తున్న మురళీ.. షాపుకు వచ్చిన కస్టమర్స్ కు మందులు ఇస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

తోటి సిబ్బంది రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. సీసీ టీవి కెమెరాలో మురళీ కింద పడిపోయిన విజువల్స్ రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News