Sunday, January 5, 2025

జీడిమెట్లలో బస్సు ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -
- Advertisement -

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం షాపూర్‌నగర్‌ చౌరస్తాలో రహదారి దాటుతున్న వ్యక్తిని వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టో మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు జీడిమెట్ల పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News