Monday, December 23, 2024

నల్లగొండ జిల్లాలో యువకుడి హత్య..

- Advertisement -
- Advertisement -

తిప్పర్తి : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహితతో అక్రమ సంబంధం కారణంగానే యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సర్వారం గ్రామానికి చెందిన చిరబోయిన శంకర్(25) అదే గ్రామానికి చెందిన మధుసూదన్ భార్యకు శంకర్ తరచుగా ఫోన్ చేస్తూ ఉండేవాడు.శనివారం రాత్రి సమయంలో శంకర్, మధుసూదన్ గ్రామంలోని బెల్ట్ షాపులో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో శంకర్ మధుసూదన్ భార్యకు ఫోన్ చేయగా ఫోన్ ఎందుకు చేస్తున్నావని అడగడంతో ఇరువురి మధ్య ఘర్షణ నెలకొంది.

కోపోద్రిక్తుడైన మధుసూదన్ పక్కనే ఉన్న కత్తితో శంకర్ పై దాడి చేసి పొడిచాడు. వెంటనే పక్కన ఉన్నవారు శంకర్ ను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న శంకర్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.  శంకర్ ను హత్య చేయడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News