Wednesday, January 22, 2025

యువకుడి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో గల నాగారం పాత కల్లుబట్టీ (వడ్డెర సంఘం) దగ్గరలో ఒక యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే సోమవారం నగరంలోని నాగారం పాత కల్లుబట్టీ (వడ్డెర సంఘం)లో ఈసంఘటన చోటు చేసుకుంది. పాత నాగారంకు చెందిన పటేదార్ యాదు(40) అదే ప్రాంతానికి చెందిన ఠాగూర్ విక్రమ్‌సింగ్ హత్య చేశారు. సోమవారం ఉదయం స్థానికంగా బెల్టు షాఫ్‌లో మద్యం కొనుగోలు చేసిన ఇద్దరు పాత కల్లుబట్టీలో మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో యాదును, ఠాగూర్ విక్రమ్‌సింగ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. యాదును హత్య చేసిన అనంతరం తానే యాదును చంపేశానని కుటుంబ సభ్యులకు తెలిపి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. కూలీ పని చేసుకునే వీరు ఇద్దరి మధ్య గొడవకు కారణం తెలియరాలేదు. 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు నార్త్ రూరల్ సిఐ నరహరి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News