Sunday, January 19, 2025

విజయవాడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

విజయవాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు మండలం తరకటూరుపాలెం వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు.. విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News