Wednesday, January 22, 2025

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రుద్రంగి:రుద్రంగి మండల కేంద్రానికి చెందిన వాసాల నరేష్ (30) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం అప్పుల బాధతో రుద్రంగి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన నరేష్‌ను మలేషియా పంపిస్తానని చెప్పి గ్రామానికి చెందిన ఏజెంట్ లక్ష 50 వేలు రూపాయలు తీసుకొని మోసం చేయడంతో పాటు గతంలో చేసిన అప్పులు ఉండడంతో నరేష్ బాధపడుతున్నాడని తెలిపారు.

గురువారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన నరేష్ శుక్రవారం ఉదయం రుద్రంగి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు బోరునవిలపించారు. మృతుడు నరేష్‌కు భార్య లత, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ప్రభాకర్ పరిశీలించి మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏజెంట్ల మోసాలతో అమాయకపు ప్రజలు బలి అవుతున్నారని, నకిలీ ఏజెంట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News