Thursday, January 23, 2025

సిద్దిపేటలో విషాదం: బావిలో శవమై కనిపించిన యువకుడు.. యువతి ఇంటిముందు ఆందోళన

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో శ్రీగిరిపల్లిలో విషాద ఘటన చోటుచేసకుంది. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఓ బావిలో బలరాం రమేశ్(26) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన రమేశ్.. శవమై కనిపించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని రమేశ్ ప్రేమించినట్లు సమాచారం.

యువతి కుటుంబికులే రమేశ్ ను హత్య చేసి బావిలో పడేశారని ఆరోపిస్తూ మృతదేహంతో రమేశ్ కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్రికత్త నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి.. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలినియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News