Wednesday, January 22, 2025

బాలికల హాస్టల్‌లో చొరబడిన అపరిచితుడు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్‌: పంజాబ్ యూనివర్సిటీకి చెందిన బాలికల హాస్టల్‌లో ఘోర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి బాలికల హాస్టల్ నంబర్ 4లో దాదాపు 20 నిమిషాలపాటు తచ్చాడాడు. తెల్లవారుజామున 3.45 గంటలకు హాస్టల్‌లోకి చొరబడిన ఆ వ్యక్తి 4.03 గంటలకు బయటకు వెళుతున్న దృశ్యాలు సిసిటివిలో రికార్డయ్యాయి. పంజాబ్ యూనివర్సిటీ దీన్ స్టూడెంట్ వెల్ఫేర్(డిఎస్‌డబ్లు) జతీందర్ గ్రోవర్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read: ఇన్సూరెన్స్ కుంభకోణం: సత్యపాల్ మాలిక్ ఇంటికి సిబిఐ అధికారులు

హాస్టల్‌లో ఘోర భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని ఆయన చెప్పారు. డ్యూటీలో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గేట్ల వద్ద లేరని, వారిద్దరినీ తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. విధులలో ఉన్న ఒక అటెండెంట్, మరో సెక్యూరిటీ గార్డు నిద్రపోతున్నారని ఆయన చెప్పారు. హాసటల్ వార్డెన్, ఇతర అధికారుల నుంచి సంజాయిషీ కోరినట్లు ఆయన తెలిపారు.

Also Read: మార్కెట్ ఫిన్‌ఫ్లూయెన్సర్స్‌ను స్కాన్ చేస్తోన్న సెబీ!

మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తెల్లవారుజామున బాలికల హాస్టల్ భవనంలోకి ప్రవేశించి మెట్ల ద్వారా పై అంతస్తులకు వెళ్లాడు. అన్ని అంతస్తుల వరండాలలో కలియదిరుతుతూ అతను దాదాపు 20 నిమిషాల పాటు హాస్టల్‌లోనే తడిపాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ఎవరూ అక్కడ లేరు. కాగా..అనుమానితుడు రిసెప్షన్ ఏరియాలోకి ప్రవేవించాడని, హాస్టల్‌లో దాదాపు 10 నిమిషాలు ఉన్నాడని హాస్టల్ వార్డెన్ ఆర్ సహహ్రావత్ మీడియాకు తెలిపారు. అవసరమైన అన్ని సాక్ష్యాలు, సిసిటివి ఫుటేజ్‌ను అధికారులకు సమర్పించినట్లు ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News