Friday, December 20, 2024

పండగ రోజు విషాదం…

- Advertisement -
- Advertisement -

man fell under lorry and died in hyderabad

హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పండగ పూట విషాదం నెలకొంది. తనూ నడిపే లారీ కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని దామోదర్ రెడ్డిగా గుర్తించారు. లారీ కిందకు వెళ్లి సెల్ఫ్ మోటార్ సరిచేస్తున్న క్రమంలో దామోదర్ రెడ్డి పైకి లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలపెల్లివాసి గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పండగ పూట ఇలాంటి ఘటన జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News