Wednesday, January 22, 2025

ఇండిగో విమానంలో సీట్ కుషన్ మిస్సింగ్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇండిగో విమానంలో సీట్ కుషన్ మిస్సింగ్ కావడంపై ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. దీనిపై ఆమె ఈనెల 10న తన ఎక్స్ పోస్ట్ ద్వారా ఇండిగో సంస్థకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో కుషన్ లేని సీటు ఫోటోను కూడా షేర్ చేశారు. విమానం ఎక్కిన తరువాత సీట్లు కనిపించలేదని, తాము వేరే సీట్లు తెచ్చేవరకు నిరీక్షించవలసి వచ్చిందని, ఇదంతా జరిగేసరికి విమానం 90 నిమిషాలు ఆలస్యమైందని ప్రయాణికురాలు తన ఫిర్యాదులో ఆవేదన వెలిబుచ్చారు. ప్రయాణికురాలు ఎక్స్ అకౌంట్ రెవెస్ అనే పేరుతో ఉంది.

దీనిపై ఇండిగో స్పందించింది. తదుపరి దర్యాప్తు చేయడానికి ఆమె పిఎన్‌ఆర్ వివరాలు పంపాలని కోరింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తమ వ్యాఖ్యల్లో అభిప్రాయాలను తెలియజేశారు. ప్రయాణికులను గౌరవించడంలోను, నాణ్యమైన సర్వీస్ అందించడం లోను ఇండిగో ప్రమాణాలు దిగజారాయని నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. “మీ సీటు మీరే కొనుక్కోండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. “కొన్ని విమానసర్వీస్‌ల్లో సీటు లేని ప్రయాణం రెగ్యులర్ వ్యవహారం” అని మరొకరు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News