- Advertisement -
సిద్దిపేట: నిబంధనలకు విరుద్దంగా చెట్టు నరికిన వ్యక్తికి జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి ,10వ వార్డు కౌన్సిలర్ బింగి బాల్ లక్ష్మిరాజేశం, సాయన్నగారి సుందర్ ఆదేశాల మేరకు 10 వేల జరిమానా విధించినట్లు హరితహారం అధికారి సామల్ల అయిలయ్య తెలిపారు. కోటిలింగాల గుడి వద్ద 10వ వార్డులోని శుభాష్ నగర్‌లో చంద్రమౌళి అనే వ్యక్తి హరిత హారంలో నాటిన స్పతోడియ, సుబాబులు చెట్లను నిబందనలకు విరుద్దంగా నరికి వేయడంతో జరిమానా విధించామన్నారు. చెట్టు కొట్టిన వ్యక్తికి తాను చేసిన పని తప్పుని చెప్పి క్షమాపణ కోరి మళ్లీ ఒక సారి ఇలాంటి తప్పు చేయయని చెప్పినట్లు అధికారులు తెలిపారు. చెట్టు కొట్టినందుకు గాను మరో 10 మొక్కలను నాటుతానని అతను తెలిపారు.
- Advertisement -