Monday, December 23, 2024

మంత్రి ఇలాకా.. చెట్లు నరికిన వ్యక్తికి జరిమానా

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: నిబంధనలకు విరుద్దంగా చెట్టు నరికిన వ్యక్తికి రూ.10వేల జరిమానా విధించిన సంఘటన సిద్దిపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్ అదేశాల మేరకు జరినామా విధించినట్లు హరితహారం అధికారి సామల ఐలయ్య తెలిపారు.

పట్టణంలోని 20వ వార్డులో స్ధానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సయ్యద్ రియాజ్ అనే వ్యక్తి హరితహారంలో నాటిన చెట్టును నిబందనలకు విరుద్దంగా నరికి వేడయంతో జరిమానా విధించి మున్సిపల్ ఆకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. మంత్రి హరీశ్‌రావు అదేశాల మేరకు సిద్దిపేటను హరితవనంగా మార్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నిబంధనలకు విరుద్దగా ఎవరు చెట్లను నరికిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News