Monday, December 23, 2024

నెలల తరబడి మకాం.. ఫైవ్‌స్టార్ హోటల్ బిల్లుకు ఎగనామం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అబూ దాబి రాజకుటుంబానికి చెందిన ఉద్యోగినని, యుఎఇలో నివసిస్తున్నానని మాయమాటలు చెప్పిన ఒక వ్యక్తి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో నాలుగు నెలలకు పైగా మకాంపెట్టి రూ. 25 లక్షలకు పైగా బిల్లును ఎగ్గొటి పరారయ్యాడు. ఫైవ్ స్టార్ హోటల్ బిల్లు ఎగ్గొట్టడమేగాక హోటల్‌లోని విలువైన వెండి సామాన్లతో ఉడాయించిన ఆ మాయగాడి కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గత ఏడాడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 20 వరకు షరీఫ్ అనే వ్యక్తి లీలా ప్యాలెస్ హోటల్‌లో బసచేశాడు. తాను యుఎఇలో నివిస్తున్నానని, అబు దాబికి చెందిన రాజకుటుంబం సభ్యుడైన షేక్ ఫలా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు చెందిన కార్యాలయంలో పనిచేస్తున్నానని షరీఫ్ హోటల్ సిబ్బందికి తెలిపాడు. అతను ఒక నకిలీ బిజినెస్ కార్డుతోపాటు యుఎఇ నివాస కార్డు, ఇతర పత్రాలు కూడా చూపించాడు.

427 నంబర్ గదిలో నాలుగు నెలల పాటు బసచేసిన షరీఫ్ నవంబర్ 20న వెండి వస్తువులు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయించాడు. హోటల్ గది బుల్ల మొత్తం రూ. 35 లక్షలకు పైగా అయినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. మొదట్లో రూ.11.5 లక్షలు కట్టిన షరీఫ్ ఆ తర్వాత బిల్లు కట్టకుండా గడిపాడని వారు చెప్పారు. అతడి పత్రాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News