సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి గ్రామ రెవిన్యూ శివారులో సోమవారం తెల్లవారుజామున సూర్యాపేట పట్టణానికి చెందిన వడ్లకొండ కృష్ణ (30) హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గడిచిన ఆరు నెలల క్రితం పిల్లలమర్రి గ్రామానికి చెందిన భార్గవిని (గౌడ) కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భార్గవి, కృష్ణ కలిసి ఉంటూ భార్గవి తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. తమ సోదరిని వడ్లకొండ కృష్ణ (మాల) ప్రేమ వివాహాం చేసుకోవడాన్ని అంగీకరించని నేపధ్యంలో కక్ష పెంచుకుని సూర్యాపేట
పట్టణంలోని తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ గౌడ్‌తో పథకం ప్రకారం హత్య చేయించారని భార్గవి ఆరోపిస్తున్నారు. ఆదివారం సాయంత్రం చరవణాకి ఫోన్ చేసి మహేష్ పిలవడంతో వెళ్లిన కృష్ణ సోమవారం తెల్లవారే సరికి సూర్యాపేట మండలం పిల్లలమర్రి శివారులోని మూసి ఎడమ కాలువ వెంట హత్యకు గురై కనిపించాడు. సంఘటన స్థలాన్ని సూర్యాపేట డిఎస్పీ జి.రవి పరిశీలించారు. హత్యకు గల కారణాలను తెలుసుకుని నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. సూర్యాపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.