Monday, January 20, 2025

మామిడి తోటలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి: మామిడి తోటలో ఓరైతు అనుమానస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. స్థానిక ఎస్‌ఐ డానియల్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా తుంగతుర్తి  మండల కేంద్రానికి చెందిన వెలుగు అంజయ్య (70) ఆదివారం మధ్యాహ్నం తోటకు వెళుతున్నానని ,చెప్పి ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య అమ్మాయమ్మ హనుమకొండలో ఉంటున్న తన కుమార్తె యాకలక్ష్మికి ఫోన్ ద్వారా తెలిపిందని తెలిపారు. యాకలక్ష్మి మామిడి తోట కాపలదారుడిగా ఉంటున్న ఉంగయ్యను తన తండ్రి గురించి వివరాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఫోన్ కలవలేదు. మంగళవారం సాయంత్రం తోట కాపలాదారు ఉంగయ్య తుంగతుర్తిలో ఉన్న వెలుగు అంజయ్య ఇంటికి వచ్చి తోటలో అంజయ్య ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడని తెలిపారు.

అంజయ్య భార్య అమ్మాయమ్మ సంఘటన స్థలానికి చేరుకుని చేతిపై గాయాలతో కుళ్ళిపోయిన స్థితిలో తన భర్త అంజయ్య చెట్టుకు వేలాడుతున్నాడని తెలిపిందని పోలీసులు తెలిపారు. తన తండ్రి మృతికి ఆస్థి విషయంపై తమ బంధువులైన పిట్టల అంజయ్య ,మడ్డి కృష్ణమూర్తి, జంగిలి జగన్నాథం, పొదిలి సుధాకర్, జంగిలి సురేష్ , ఇమ్మడి సోమనర్సయ్యలపై అనుమానం ఉందని అంజయ్య కుమార్తె యాకలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో వీరు ఆస్థి విషయంలో తన తండ్రిని చంపుతామని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఆస్థి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని , తన తండ్రి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మృతుడి కుమార్తె యాకలక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డానియల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News