Thursday, January 23, 2025

అల్లుడి మెడలో చెప్పుల దండవేసి… అర్ధనగ్నంగా ఊరేగించారు…

- Advertisement -
- Advertisement -

భోపాల్: గుర్తింపు లేని కాలేజీలో చదువు వద్దని భార్యకు చెప్పినందు అత్తింటి వారు అల్లుడికి చెప్పులు దండవేసి అర్థనగ్నంగా ఊరేగించిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురమ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వివేక్ ఇవ్నే అనే వ్యక్తి సేందర్వాడా గ్రామంలో నివసిస్తున్నాడు. వివేక్ భార్య నర్సింగ్ కాలేజీకి వెళ్తోంది. ఈ కాలేజీకి గుర్తింపులేదని అక్కడికి వెళ్లొందని భార్యకు భర్త చెప్పాడు. అతడి మాట పెడచెవిన పెట్టి ఆమె రోజు కాలేజీకి వెళ్తుండడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. వెంటనే తాను పుట్టింటికి వెళ్లిపోయింది. తమ మధ్య జరిగిన గొడవ గురించి పుట్టింటికి వారికి చెప్పడంతో వివేక్ మామ ధర్మరాజ్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి సేందర్వాడా గ్రామానికి వచ్చారు. వివేక్ బండబూతులు తిట్టడంతో పాటు అతడిపై మామ దాడి చేశాడు. వివేక్ ముఖానికి పేడ పూసి… మెడలో చెప్పుల దండవేసి ఊరేగించారు. వివేక్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News